Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 6:17 pm Posted by : ramakrishna

మనిషిలో పరివర్తన వస్తే మహర్షి కాగలడు

బతుకమ్మ, బిచ్కుంద : మనిషిలో పరివర్తన వస్తే మహర్షి కాగలడు అని నిరూపించిన మహర్షి వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలని  బిచ్కుంద మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ సాహిల్ శెట్కర్  అన్నారు. మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగ   వాల్మీకి మందిరంలో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సాహిల్ శెట్కర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు పుట్టిన మన పండితుల గడప నందు జన్మించిన మహర్షి వాల్మీకి గొప్ప సాంస్కృత ఆదికవిగా గుర్తించబడి, మానవ సమాజానికి అందించిన అపురూపమైన కానుక రామాయణ మహాగ్రంథమన్నారు. పూజనీయ రామాయణ మానవ విలువలు, మానవ సంబంధ బాంధవ్యములు, ప్రవర్తన విధానములు మనందరికి అందించారని ఆయన అన్నారు. వాల్మీకి పేద కుటుంబములో పుట్టినటువంటి పుణ్యపురుషుని జయంతిని ప్రభుత్వము అధికారికంగా జరుపడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని అడగు జాడలలో నడవాలని  ఆశిస్తూ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ముదిరాజ్ సంఘ సభ్యులు బంటు శీను, తౌటి సాయిలు, హన్మండ్లు, కాంగ్రెస్ నాయకులు బండు పటేల్, ధర్పల్ దశరథ్, సాయిని అశోక్, ఖలీల్, యోగేష్ మంచివార్, మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.