. . . జిల్లా ఆరోగ్య వైద్య శాఖాధికారిణి డా.రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పిల్లల (0-5 సంవత్సరాలు) అభివృద్ధిలో జాప్యాలు, నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలు, శారీరక వైకల్యాలను ముందుగానే గుర్తించడానికి ఉద్దేశించిన బాల భరోసా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య శాఖాధికారిని డా.రాజశ్రీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం విభాగం ఆధ్వర్యంలో బాల భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మహిళా శిశు సంక్షేమ శాఖా, ఆరోగ్య శాఖా సమన్వయము తో పనిచేయాలని రాజశ్రీ, జిల్లా సంక్షేమాధికారిణి పద్మ కోరారు. నవజాత శిశువు నుండి 18 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం లో భాగంగా మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ చేయిస్తామన్నారు. ఏవైనా సమస్యలు ఉన్న విద్యార్థులకు ఎర్లీ ఇంటర్వెన్షన్ కేంద్రం లో పుట్టుకతో వచ్చే లోపాలకు, దంత సమస్యలకు, అనీమియా, పోషకాహార లోపాలకు, గుండె సంబంధిత వ్యాధులు, చిన్నారుల్లో అన్ని రకాల శస్త్ర చికిత్సలకు, దంత సమస్యలకు, కంటి సమస్యలకు, చర్మ వ్యాధులకు, తదితర వ్యాధులకు చికిత్సలు చేయించబడునని రాజశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగ మోహన్ రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.అశోక్, సిడిపివో లు, సూపర్ వైజర్ లు, మెడికల్ హెల్త్ టీం డాక్టర్ లు, ఆర్ బి ఎస్ కె సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
