హై రిస్క్ గర్భిణీలను గుర్తించి మాత శిశు మరణాలను అరికట్టాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రమాద లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించి, సమర్థవంతంగా నిర్వహణ చేసినప్పుడే మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి. రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు మంగళవారం గంగస్థాన్ లోని ఐఎంఏ హాల్ లో ప్రమాద లక్షణాలు గల గర్భిణీ స్త్రీల గుర్తింపు, నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా శిక్షణ కేంద్ర ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వినయ్ కుమార్ నిర్వహించారు....