Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 2:37 pm Posted by : ramakrishna

పెద్దపులి అడుగుల గుర్తింపు

కామారెడ్డి, బతుకమ్మ : దోమకొండ మండలం అంబర్ పేట గ్రామ శివారులో గురువారం  గ్రామానికి చెందిన స్వామిగౌడ్ అనే రైతు యొక్క దూడలపై పెద్దపులి దాడి చేసినట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.  పెద్దపులి కదలికలు ట్రాఫ్ కెమెరాలలో రికార్డు అయ్యాయి.  పెద్దపులి సంచారంతో  గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.  పెద్దపులి కోసం ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు.  గొట్టుముక్కల గ్రామ శివారులోని పెద్ద చెరువు లో పెద్దపులి అడుగులను గుర్తించి లక్ష్మీ దేవునిపల్లి, గొట్టిముక్కుల గ్రామాలకు చెందిన రైతులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సోమవారం ఫారెస్టు అధికారులు పరిశీలించారు. గతంలో ఎఫ్12 పులి మాచారెడ్డి మండలంలో అలజడి రేపిన విషయం తెలిసిందే.


Identification of tiger footprints