Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2024, 12:44 am Posted by : ramakrishna

ఆదర్శ రైతులు.. అద్భుత దిగుబడులు..

బతుకమ్మ, మోర్తాడ్:ఆగస్టు10: ప్రతి మనిషి కడుపునిండా భోజనం తినాలంటే వ్యవసాయం చేసే రైతన్న ఉండవలసిందే, రైతు లేనిదే మనిషి జీవితాలు లేవని kanchan సీడ్స్ ప్రతినిధి రమేష్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ కాలంలో మొక్కజొన్న, సజ్జ పంటలు అధిక దిగుబడి సాధించిన రైతులకు మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో శనివారం నాథ్ సీడ్స్, kanchan సీడ్స్ ఆధ్వర్యంలో ఏలేటి జగన్ రెడ్డి ఆదేశాల మేరకు శేట్ పల్లీ గ్రామ రైతులకు బహుమతులు అందించడం జరిగింది. మొక్కజొన్న పంటలో ప్రథమ బహుమతిగా లక్కారం శ్రీనివాస్, రెండో బహుమతిగా రాడే మోహన్, సజ్జ పంట అధిక దిగుబడి సాధించిన రైతులలో మొదటి బహుమతి గురజాల శ్రీనివాస్, నర్సయ్య (పాల్ ) రైతులకు వాటర్ ప్యూరిఫైడ్ యంత్రాలను బహుమతులుగా అందించడం జరిగింది. కార్యక్రమంలో గురిజాల నర్సారెడ్డి, శ్రీనివాస్, పుప్పాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.