Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 9:26 pm Posted by : ramakrishna

బాధ్యతలు స్వీకరించిన ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక గుర్బాబాది రోడ్ లోని ఇందూర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (ఐ.డి.సి.యం.యస్.) లి., నిజామాబాద్ యందు సొసైటీ నూతన అధ్యక్షులు బాదావత్ తారాచంద్ నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తూ, భాధ్యతలు స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా నిజామాబాద్ రూరల్ శానస సభ్యులు డా॥ ఆర్. భూపతిరెడ్డి విచ్చేసి నూతన అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సొసైటి అధ్యక్షులు తారాచంద్ నాయక్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఉమ్మడి జిల్లా పదవి ఏ గిరిజన వ్యక్తికి రానీది నాకు రావడం చాలా సంతోషాకరముగా వున్నదని, నా యొక్క 35 సం॥రాల రాజకీయ అనుభవాన్ని దృష్టి యందు యుంచకొని నాకు ఈ పదవి ఇప్పించినటువంటి వంటి బోధన్ శానస సభ సభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి, నిజామాబాద్ రూరల్ శానస సభ సభ్యులు భూపతి రెడ్డికి, శాసన మండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నా యొక్క పదవి కాలములో సహకార వ్యవస్థలో వున్నటువంటి లోపాలను సరిదిద్దుతానని, ఉమ్మడి జిల్లాలో గల అన్ని సహకార సంఘములకు సంబంధించిన రైతులకు అనరమైనటువంటి ఋణాలు, ఎరువులు, విత్తనాలు సకాలములో అందేలా చేస్తానని, ఏ ఒక్క రైతుకి కూడా ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి రావడం చాలా సంతోషకరమన్నారు.

తారాచంద్ నాయక్ ఉమ్మడి జిల్లాలోని సహకార వ్యవస్థను అభివృద్ధి చేస్తాడని నమ్మకం నాకు వున్నదని, వీరికి ఎళ్ళవేళల నా యొక్క సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉర్దు అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, కాంగ్రేస్ పార్టీ నగర అధ్యక్షులు కేశ వేణు, కామారెడ్డి జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, రూరల్ నియోజికవర్గ కాంగ్రేస్ పార్టీ నాయకులు, ఎన్.డి.సి.సి. బ్యాంక్, ఐ.డి.సి.యం.యస్. డైరెక్టర్లు, సిబ్బంది, అధికారులు మరియు పెద్ద ఎత్తున రైతులు పాల్గోన్నారు.

IDCMS Chairman Tarachand Naik took charge