ఐడీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ

నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు కామారెడ్డికా లేక నిజామాబాద్ కా? బతుకమ్మ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: ఇందూరు డిస్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు చైర్మన్ గా ఉన్న సాంబరి మోహన్ పై ప్రభుత్వం మారగానే డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఐడీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. సాంబారి మోహన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం బిక్కనూర్ కు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి ఇంచార్జి చైర్మన్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. అయితే...