ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్, బతుకమ్మ:  తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి  చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ఏపీ కేడర్ కు కేటాయిస్తూ డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌ గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారులతో పాటు డీవోపీటీ తరఫున వాదనలు విన్న కోర్టు...