Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 8:26 pm Posted by : ramakrishna

నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడ్డాను… ఆశీర్వదించండి…

బిచ్కుంద, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీ తరఫున గత బిఆర్ఎస్ హయాంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికిని కాసింత కూడా నిరాశకు గురికాకుండా నమ్ముకున్న పార్టీని, తన వెంట వచ్చిన కార్యకర్తలను కాపాడుకుంటూ కష్టకాలంలో కూడా పార్టీనీ నమ్ముకున్న కార్యకర్తలను వెన్నంటి ఉండి ముందుకు నడిపించారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సాయిని అశోక్ గాయత్రి కాగా ఈసారి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు (కింది గల్లి) నుంచి బరిలోకి దిగుతున్నామని ప్రజలు తమను గెలిపించినట్లయితే మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేసుకుంటామని వారు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదించినట్లయితే మూడో వార్డు(కింది గల్లి) మొత్తాన్ని అభివృద్ధి చేసుకుందామని వారు అన్నారు. మూడవ వార్డులో (కింది గల్లి)ఉన్న సమస్యలను తాము కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలోకి రాగానే దశల వారీగా పూర్తి చేసుకుందామని దీనికోసం ప్రజలందరూ తమను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. రెండుసార్లు గతంలో బిఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్లు తమ మూడో వార్డుకు ఏం అభివృద్ధి చేసారని ఓట్లు అడుగుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. పది సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారో చెప్పాలని వారు అన్నారు. పది సంవత్సరాలుగా ప్రజలకు అనేక మాటలు చెప్పి మోసం చేశారని ఈ మోసపూరిత మాటలను ప్రజలు ఈసారి నమ్మబోరని అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని, మీ మోసపూరితమైన మాటలకు దగాకోరు పాలనకు ప్రజలు చరమగీతం పాడారని ఆయన స్పష్టం చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున తనను గెలిపించినట్లయితే ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మూడో వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆపదలో ఆదుకుంటూ మూడవ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ ఆయన పేరుపేరునా విజ్ఞప్తి చేశారు.