Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 10:04 pm Posted by : ramakrishna

తండా అభివృద్ధికి కృషి చేస్తా

  • ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

 

ఆర్మూర్, బతుకమ్మ : అమ్రాద్ తండా అభివృద్ధికి గాను తన వంతు కృషి చేస్తానని ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. తండాలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జ్యోతిని వెలిగించి పొట్టిలను ప్రారంభించారు. ముందుగా స్థానిక జగదాంబ మత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజాలను నిర్వహించారు.అనంతపురం తాండవాసులు వినాయరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల ప్రెసిడెంట్ రవి ప్రకాష్ గారు, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరి నాయక్ , ఆల్ ఇండియా ఆల్ బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రమావత్ నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కేతావత్ పీర్ సింగ్ నాయక్ , సకారం , తారాచంద్ , ఆనూరు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పవను పండిట్ ,రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్ రాంజీ , ధారాసింగ్ , నాయకులు గంగాధర్ గౌడ్ , మూడ్ గంగారం నాయక్ , అర్గుల నరసయ్య , మాజీ ఎంపీటీసీ వెంకటేష్ , ముల్లంగి అశోక్ , జిమ్మీ రవి , డైరెక్టర్ శేఖర్ , వెంకటగిరి ,గ్రామ సెక్రెటరీ , కార్యకర్తలు, ప్రజలు, కబడ్డీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

I will work hard for the development of the team