Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:16 pm Posted by : ramakrishna

అంకితభావంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా…

 

. . . మోర్తాడ్ మండల అధ్యక్షుడు బక్కూరి ఆనంద్

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

అధిష్టానం తనపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు అంకితభావంతో కార్యకర్తలను నాయకులను అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మోర్తాడ్ మండల అధ్యక్షుడు బక్కూరి ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గం లో నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. నియోజకవర్గంలోని కమ్మర్ పల్లీ మండల అధ్యక్షుడిగా బోనగిరి భాస్కర్, బాల్కొండ మండల అధ్యక్షుడిగా సట్ల ప్రవీణ్, ముప్కాల్ మండల అధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డి, మెండోరా మండల అధ్యక్షుడిగా పడాల సాయి రెడ్డి, ఏర్గట్ల మండల అధ్యక్షుడిగా శివన్నోళ్ళ శివకుమార్, వేల్పూర్ మండల అధ్యక్షుడు రంగు అనిల్ కుమార్, భీమ్ గల్ మండల అధ్యక్షుడిగా లక్ష్మణ్, భీంగల్ పట్టణ అధ్యక్షుడిగా పరుష అనంతరావు ఎన్నికయ్యారు.