. . . నగర మేయర్ ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అమ్మా నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అమ్మ నగర్ అభివృద్ధి కోసం కృషి చేస్తా అని నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. ఆదివారం అమ్మ నగర్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మా నగర్ ఆఫీసు లో నూతన మేయర్ ఉమారాణి ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువస్తూ వినతి పత్రం అందజేశారు.

అనంతరం నూతన కార్పోరేటర్ ప్రమోద్, పుల్గం వైష్ణవి సుధా, బొబ్బిలి సువర్ణ వేణు గోపాల్, పంచరెడ్డి లలితచరణ్, న్యాలం మధు లను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ నగర్ హౌస్ హోల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యెండల కిషన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి కిషన్, అధ్యక్షులు రెంజర్ల నరేష్, ఉపాధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, కోశాధికారి మహేందర్, ఎర్రన్న, శంకర్, మధుసూదన్, ప్రవీణ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.