జానపద, ఉద్యమ కళాకారులకు అండగా ఉంటా

వారి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులకు అండగా నిలుస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ వారసత్వ జానపద కళారూపాలను కాపాడుతూ రేపటి తరాలకు తెలియజేస్తోన్న కళాకారులు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగించడం విచారకరమన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు,...