Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 6:59 pm Posted by : ramakrishna

గౌడ కులస్తులకు అండగా ఉంటా

 

. . . ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గౌడ కులంలో జన్మించినందుకు నాకు చాలా గర్వ కారణంగా ఉందని గౌడ కులస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో గల పట్టణ గౌడ సంఘం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టణ గౌడ సంఘం, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో నిజాయితీతో గౌడవృత్తికి సమాజంలో అన్ని కులాల కంటే మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. గౌడ కులస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన తాము సహించబోనని వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ప్రభుత్వ పరంగా పరిష్కారం అయ్యే విధంగా ప్రత్యేక చొరవ చూపుతానని ఆయన భరోసానిచ్చారు. గౌడ కులంలో నికార్సైన అర్హులైన గౌడ కులస్తులను గుర్తించి వారిలో ప్రతి ఒక్కరికి గౌడ కులస్తులలో సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గౌడ కులవృత్తికి చేసింది శూన్యమని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోని గౌడ కులస్తులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి ఒక గౌడ కులస్తులు తమకు చెందిన స్థలాల్లో ఈత వనాలు పెంచుకుంటూ మన సొసైటీ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ వాటిని పెంచాలని అన్నారు. మరి ముఖ్యంగా గౌడ కులస్తులందరూ ఐక్యమత్యంతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, శేఖర్ గౌడ్, ఖిల్లా గంగాధర్ గౌడ్, దయాకర్ గౌడ్, నర్సాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.