రైతుల సమస్యలకు అండగా ఉంటా

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, మంజీర నదిలో పెరిగిన వరద ప్రవాహాల కారణంగా రైతుల పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాగిరెడ్డిపేట్ మండలంలోని చిన్నూర్, బంజారా తండా గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో వందల ఎకరాల పంటలు నీటమునిగిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తక్షణమే స్పందించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ సీఈ, డీఈ...