Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 4:50 pm Posted by : ramakrishna

బాధితులకు అండగా ఉండి ఆదుకుంటా…

 

. . . అర్సపల్లి షార్ట్ సర్క్యూట్ బాధితులకు అర్బన్ ఎమ్మెల్యే పరామర్శ

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన బీజేపీ నాయకురాలు మీరా వైచల్ కుటుంబానికి అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని అర్సపల్లి లో గల జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి, కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీరా వైచల్ పిల్లల విద్యాభ్యాసానికి తన వంతు సహాయం ఉంటుందన్నారు. షార్ట్ సర్క్యూట్ తో సర్వం కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం కూడా వీలైనంత తొందరగా అందేలా చూడాలని ఆర్డిఓ రాజేంద్రప్రసాద్ ను ఆదేశించారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 

I will stand by and support the victims...
I will stand by and support the victims…

 

అనంతరం ధన్ పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నెలవారి నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే తో పాటు కార్పొరేటర్ మఠం పవన్, బీజేపీ నాయకులు గడ్డం రాజు, పవన్ ముందడ, బంటు ప్రవీణ్, మేధరి శేఖర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

 

I will stand by and support the victims...
I will stand by and support the victims…