నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు…

రోగుల పట్ల ఇష్టారీతిన మాట్లాడుతున్న వైద్యులు   రుద్రూర్, బతుకమ్మ : కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నేలా సర్కార్‌ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు నోటి మాటగానే మిగిలిపోతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య చికిత్సలు చేయడంలో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పేద ప్రజలకు అరకొరగా వైద్యం అందిస్తున్నారని ఆసుపత్రికి వచ్చే రోగులు వాపోతున్నారు. గురువారం రోజున పలువురు రోగులు ప్రథమ చికిత్స కొరకు ఆసుపత్రికి వెలితే ఇక్కడ ప్రథమ చికిత్స చేసే వారు లేరని సమాధానమిచ్చారన్నారు. ...