- ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మానాల, బతుకమ్మ: మానాల దేగావత్ తండాలో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ మాత ,శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన, పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానాల గ్రామం ఉద్యమ కాలం నుండి నాతో వెంట నడిచిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మానాల గ్రామానికి అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఇకముందు కూడా ఏ అవసరం వచ్చిన చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు..ఈ ప్రభుత్వం సహకరించకుంటే మన ప్రభుత్వం వచ్చాక మీ మనసులో ఉన్న కావాల్సిన పనులు అన్ని పూర్తి చేయడానికి ముందు ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాతా దీవెనలు ఎల్లప్పుడూ ఈ రాష్ట్ర ప్రజలపై ముఖ్యంగా నా గిరిజన బిడ్డలపై ఎల్లపుడు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
