ఆరెకటిక సమాజానికి నా వంతు కృషి చేస్తా
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆరెకటిక సమాజానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ పట్టణంలోని ఆరెకటిక సంఘం లో ఆరెకటిక నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు న్యామతాబాద్ రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మిరియాల్ కార్ మోహన్, క్యాషియర్ గా ఆంకర్ శ్రీనివాస్ లను అభినందించారు....