Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 7:07 pm Posted by : ramakrishna

ఆరెకటిక సమాజానికి నా వంతు కృషి చేస్తా

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆరెకటిక సమాజానికి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ పట్టణంలోని ఆరెకటిక సంఘం లో ఆరెకటిక నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు న్యామతాబాద్ రవీందర్, ప్రధాన కార్యదర్శిగా మిరియాల్ కార్ మోహన్, క్యాషియర్ గా ఆంకర్ శ్రీనివాస్ లను అభినందించారు. నూతనంగా ఎన్నికైన వారు ఎలాంటి స్వార్థాలకు పోకుండా సంఘ అభివృద్ధికి సంఘంలోని నిరుపేదలకు అండగా ఉంటూ అందరికి ఆదర్శంగా ఉండాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి వారికి అండగా ఉంటుందన్నారు. సంఘంలోని నిరుపేదలను గుర్తించి వారికి ఇంద్రమ్మ ఇల్లు అవకాశం కల్పిస్తామని చెప్పారు.