Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 6:53 pm Posted by : ramakrishna

ప్రభుత్వ విద్య బలోపేతానికై సహకరిస్తా…

 

. . . మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రభుత్వ విద్య బలోపేతానికై ఎమ్మెల్యే తో చర్చించి సహకరిస్తానని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం చైర్మన్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘ సభ్యుల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఏటీసీ సెంటర్ తీసుకువచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలియజేయగా, సంఘ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కనీరామ్ మెగావత్, మండల అధ్యక్షులు వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు జ్ఞానేశ్వర్, మండల ఉపాధ్యక్షులు మాన్య, నౌశ్య, కార్యదర్శులు శివరాములు, వినోద్ పాల్గొన్నారు.