వెబ్ న్యూస్,బతుకమ్మ : ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ హైదరాబాద్లోని లింగంపల్లిలో గల గ్రౌండ్ కు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి మ్యాచ్లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశామన్నారు అందరం సమిష్టిగా కష్టపడ్డామన్నారు. చాలా ఒత్తిడి లోను తాను బ్యాటింగ్ చేశా నని పేర్కొన్నారు. దేశాన్ని గెలిపించే లక్ష్యంతో ఆడాను అని తెలిపారు. కాగా, ఆసియా కప్ అనంతరం తిలక్ వర్మ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈసందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో తిలక్ వర్మకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.