Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 11:36 am Posted by : ramakrishna

గెలువమని తెలుసు : రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటి, రెండో స్థానాల్లో కొనసాగుతుండగా.., బీజేపీ వెనుకబడింది. కాగా, ఈలెక్కింపు ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఈఎన్నికల్లో గెలవమని ముందే తెలుసని హాట్ కామెంట్స్ చేశారు. కేవలం ప్రాతినిధ్యం వహించడానికి తమ పార్టీ ఈఎన్నికల్లో పోటీ చేసిందని వ్యాఖ్యనించారు. ఓట్ల లెక్కింపు వద్ద ఆపార్టీనాయకులు, కార్య కర్తలు ఎవరు లేకపోవడం గమనార్హం. ఆరో రౌండ్  ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 7,296 ఓట్లు వచ్చాయి.