నేను ఏతప్పు చేయలేదు : నటి హేమ
విజయవాడ,బతుకమ్మ : ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మను నటి హేమ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని వార్తలు రాసేటప్పుడూ నిజానిజాలు తెలుసుకొని రాయాలని పేర్కొన్నారు. గతేడాది చేయని తప్పుకు నాపై నీలాపనిందలు వేశారని, అవన్నీ దుర్గమ్మ తుడిచిపెట్టిందన్నారు. దయచేసి ఏదైనా వార్త రాసేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని వేయండని ఆలయంలో హేమ కంట తడి పెట్టారు.