- డైరెక్టర్ గా అజ్జ శ్రీనివాస్, మంత్రి సుమన్ ల తొలగింపు
- కొత్త డైరెక్టర్లతో సీఎంసీ ఆసుపత్రి నిర్వహణ
- విలేకరుల సమావేశంలో సీఎంసి ఛైర్మన్ షణ్ముఖ లింగం
నిజామాబాద్, బతుకమ్మ : ఎవరి వద్ద నుంచి రూపాయి డబ్బు వసూలు చేయలేదని ఎక్కడికి పారిపోలేదని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) ఛైర్మెన్ షణ్ముఖ లింగం అన్నారు. డిచ్ పల్లి సీఎంసి మెడికల్ కాలేజ్ వ్యవహారంలో కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ మహాలింగం సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎంసి మెడికల్ కాలేజ్ లో నాలుగు నెలలుగా జరిగిన అవినీతి అక్రమాలు నియామకాలపై స్పందించారు. ఎం/ఎస్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంఎస్ఆర్) అనుభవజ్ఞులైన నిపుణులు,వైద్య నిపుణుల బృందం స్థాపించిందన్నారు. అక్టోబర్ 2024లో నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలోని సీఎంసి మెడికల్ కాలేజ్ నువివిధ దశల్లో రూ. 200 కోట్లతో మళ్ళీ ప్రారంభించి కొనసాగించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఐఎంఎస్ఆర్ ప్రయత్నాలతో 500 పడకల సీఎంసి ఆసుపత్రిని మే 25న రాష్ట్ర అధికారుల ఆమోదంతో ప్రజల కోసం తిరిగి ప్రారంభించామని గుర్తు చేశారు. ఏప్రిల్ 2025లో నిజామాబాద్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజ్జా శ్రీనివాస్ అనే వ్యక్తి 200 మంది వైద్యుల నెట్ వర్క్ ఉందని చెప్పి 30 మందిని నియమించారని దానికి యజమాన్యం అనుమతి లేదన్నారు. ఎంసిఐ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నియమిచాలని సూచించామని కానీ డాక్టర్ అజ్జా శ్రీనివాస్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో పని చేస్తున్న డాక్టర్ మంత్రి సుమంత్ పలువురు వైద్యులు తాత్కాలిక నియామకాలతో పనిలోకి తీసుకున్నామన్నారు. డాక్టర్ అజ్జ శ్రీనివాస్ మెడికల్ కాలేజీ , ఆసుపత్రి,ఫార్మసీ దుకాణాల నిర్వహణ,నిర్మాణ పనులు,వైద్య పరికరాల కొనుగోలు క్యాంపస్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కన్నెశారన్నారు. మూడు చెక్కులు రూ. 5 కోట్లకు ఇచ్చారని దీని కోసం డైరెక్టర్ పోస్టు ఇచ్చామని,కానీ చెక్కులు డ్రా చేయడానికి వెళితే చెక్కుల డ్రా కు అనుమతి ఇవ్వొద్దని లేటర్ ఇచ్చాడని తెలిపారు. గోపతి రవి కుమార్, బానోత్ ప్రీతి యాజమాన్యంలోని ములుగులోని మెస్సర్స్ బాలాజీ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎ. శంకర చారి మధ్యవర్తిగా రూ.92 లక్షల విలువైన పాత వైద్య పరికరాలను కొనుగోలు చేసారని ఈ డబ్బు చెక్కుల రూపంలో చెల్లించామని వీటిలో రూ.72 లక్షల సామాగ్రి ఇంక అందివ్వలేదన్నారు. ఏప్రిల్ 8 2025లో రూ.8884790 విలువైన పరికరాలను కొనుగోలు చేశారని సీఎంసి నుంచి తీసుకున్న వేకెంట్ చెక్కులను ఛైర్మెన్ అనుమతి లేకుండా అక్కడ అందజేశారని తిలపారు. దీనిపై ఆ కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేయగా ఆ తరువాతనే అజ్జ శ్రీనివాస్ ను జూన్ 10న తొలగించారన్నారు. హైపవర్ కమిటీ చివరకు అజ్జ సర్టిఫికెట్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. హెచ్పీఎస్,ఎన్ఎంసీ లు అజ్జ శ్రీనివాస్ దరఖాస్తును తిరస్కరించాయన్నారు. చావనైనా చస్తా గానీ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తానని,ఎవరి వద్ద నుంచి కూడా రూపాయి డబ్బులు వసూలు చేయలేదన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరానని, నేను ఎక్కడికి పారిపోలేదని చైర్మన్ అప్రూవల్ లేకుండా 120 మంది నియామకం చేసారని, అర్హత లేని వారిని తొలగించామన్నారు.