Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 7:09 pm Posted by : ramakrishna

నా స్వార్థం కోసం సీఎంను కలవలేదు

  • నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే సీఎంను కలిశాను
  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ బతుకమ్మ : బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కుటుంబం నా స్వార్థం కోసం సీఎంను కలవలేదని బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే సీఎంను కలిశాను అన్నారు. సీఎం దగ్గర నా స్వార్థం కోసం పోతే నేను రాజీనామాకు సిద్ధమే అన్నారు. నేను స్పీకర్గా ఉన్నపుడు అభివృద్ధి కోసం మాజి సీఎం కె.సి.ఆర్. అడిగినన్ని నిధులు మంజూరు చేశారు అని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరం అందుకే సీఎం రేవంత్ రెడ్డి ని అభివృద్ధి కొరకు నిధులు కావాలని కలిశానని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, అబ్దుల్ వహాబ్, పిట్ల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.