Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 2:23 pm Posted by : ramakrishna

హేళనకు గురై ఐ బొమ్మ సృష్టి

వెబ్ న్యూస్, బతుకమ్మ : భార్య,అత్తల అవహేళనలకు గురై ఐ బొమ్మను సృష్టించానని ఐ బొమ్మ నిర్వహకుడు రవి తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, అత్త ఎప్పుడు తాను ఎందుకు పనికిరానని అవహేళన చేసేవారని రవి పోలీసులు ముందు వాపోయారు. 2021లో బెట్టింగ్ యాప్స్ ద్వారా రూ. 75 లక్షలు సంపాదించినా  తనను నమ్మలేదని, దీంతో తాను ఇలాంటి దారి ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.  తాను పోలీసులకు దొరికిపోవడానికి భార్య, అత్త కారణమని ఆరోపించారు.