- ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల విలువ ఎంతో గొప్పది
- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : గ్రంధాలయాలలో దొరికే పుస్తకాల విలువ రాష్ట్ర సాంకేతిక రంగం ఎంత పెరిగినప్పటికీ వాటి విలువ వాటికే ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. తాను ఈ స్థాయిలో జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నానంటే గ్రంధాలయాలలో దొరికిన సివిల్స్ పుస్తకాలు చదవడం వల్ల కలెక్టర్గా ప్రస్తుతం మీ ముందుఉన్నానని ఆయన అన్నారు. కేవలం నేనే కాకుండా ఎంతోమంది నిరుపేద అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే అభ్యర్థులు గ్రంథాలయాల్లో దొరికే పుస్తకాలను చదివిప్రయోజకులుగా మారుతున్నారని అన్నారు.ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మోడల్లైజేషన్ లైబ్రరీలు, డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేసేందుకు ప్రభుత్వదృష్టికి తీసుకువెళ్తామన్నారు.అదేవిధంగా జిల్లాలో కొన్ని గ్రామాల్లో లేని లైబ్రరీల నిర్మాణాల కోసంకూడా ప్రభుత్వంతో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేచదివే వారికోసంకొత్త గ్రంధాలయాల ఏర్పాటు కూడా ప్రభుత్వంతో మాట్లాడి గ్రంథాలయాల నిర్మాణానికి శ్రద్ధ వహిస్తామన్నారు. ఆధునిక పరిజ్ఞానం, సోషల్ మీడియా, ఫోన్లు, కంప్యూటర్లలో దొరకని విషయ పరిజ్ఞానం గ్రంధాలయాలలో లభించే పుస్తకాల్లో దొరుకుతుంది అనడంలో ఆతియోశక్తి లేదు. ఉదాహరణకు తాను కలెక్టర్గావిధులు నిర్వహించాలని ఒకే ఒక లక్ష్యంతోప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న సివిల్స్ పుస్తకాలను చదివి కలెక్టర్గా అయ్యానని గుర్తు చేశారు. మొబైల్స్, దొరకని సమాచారం గ్రంధాలయాలు లభించే పురాతన పుస్తకాల్లో దొరుకుతుంది. అందులో దొరికినంత పరిజ్ఞానం మరొకచోట దొరకదు అన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్న కేంద్ర గ్రంథాలయ ఆవరణలో జిల్లావ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షల కోసం వచ్చే విద్యార్థులకు స్థలం దొరకక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, ప్రభుత్వంతో మాట్లాడిపాత డీఈఓ కార్యాలయంలోమరో కొన్ని అదనపు గదులు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్, ఢిల్లీలో ఉండే గ్రంధాలయాలు దొరికే కాంపిటీషన్ పుస్తకాలు జిల్లా గ్రంథాలయాల్లో కూడా దొరికే విధంగా తెప్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నం చేస్తానన్నారు. అనంతరం గ్రంధాలయ వారోత్సవాల్లో వివిధ పాఠశాలల్లో సంస్కృతిక కార్యక్రమాలు చేసి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి,అడిషనల్ కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్మానాల మోహన్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ అంజన తదితరులు పాల్గొన్నారు.
