Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 12:52 pm Posted by : ramakrishna

అవయవ దానానికి సిద్ధంగా ఉన్నా : కేటీఆర్

వెబ్ న్యూస్, బతుకమ్మ : అవయవదానానికి  అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. అవయవదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈప్రకటన తెలిపారు. అవయవదానం బిల్లుకు తన మద్దతు ప్రకటించారు. ప్రజాప్రతినిధులం అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు.  ఎమ్మెల్యేలు అందరూ అవయవ దానంపై ప్రతిజ్ఞ చేయాలని కేటీఆర్ కోరారు. అవయవదానం పత్రంపై ఎమ్మెల్యేగా తాను మొదటి సంతకం పెడతానని కేటీఆర్ తెలిపారు.