Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:53 pm Posted by : ramakrishna

ఈసీ అవకాశం రావడం గర్వంగా ఉంది

 

. . . ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి

 

. . . తె.వి.వి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దండు స్వామి కి సన్మానం

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

ప్రతిష్టాత్మకమైన గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోనే తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభం చేశారనీ, 20 సంవత్సరాల తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ (ఈసీ) అవకాశం కల్పించడం గర్వంగా ఉందని ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి అన్నారు. కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా ఎన్నికైన జీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండుస్వామి ని అధ్యాపకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దండు స్వామికి తె.వి.వి పాలకమండలి సభ్యుడుగా అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రంగరత్నం, స్టాఫ్ క్లబ్ కో ఆర్డినేటర్ రంజిత, అధ్యాపకులు భరత్ రాజ్, నహీదా బేగం, వినయ్ కుమార్, రామస్వామి, ముత్తెన్న, రాజేశ్, ప్రతిభ, నాగజ్యోతి, రమేష్ గౌడ్, అనసూయ, బాలమణి, జయప్రసాద్, ఏవో.రాంకిషన్, సూపరిండెంట్ ఉదయ్ భాస్కర్, అన్ని విభాగాల అధిపతులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.