Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 1:07 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనీ.. నేనే చేస్తున్నా

. తెచ్చిన నవోదయను సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు

. ఎన్ఎస్ఎఫ్ భూములు ప్రైవేట్ వి.. ఆ భూములు ఎలా ఇస్తారు?

. ఆయన షుగర్ ఫ్యాక్టరీని తెరవనీయడు..

. సొంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తుండు

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణకు 7 నవోదయలు మంజూరైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 నవోదయలను తీసుకొచ్చానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో జక్రాన్ పల్లి మండలం కలిగోట్ వద్ద నవోదయ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణను ఒప్పించి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియోజకవర్గమైన నిజామాబాద్ రూరల్ పరిధిలో పెడుతున్నామన్నారు. నవోదయ ఏర్పాటుపై సీఎం రేవంత్ తో, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు పై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడనని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు తానే చేస్తున్నానని అర్వింద్ అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని, తాను తీసుకొచ్చిన ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.

I am doing the work of Congress MLAs..

నిజాం షుగర్స్ ను తెరవనీయుడు..

జక్రాన్ పల్లి మండలం కలిగోట్ లో నవోదయ ఏర్పాటుకు స్థానిక తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్, రాష్ఱ్ట విద్యాశాఖ కమిషనర్ ప్రతిపాదలను సిద్ధం చేస్తే, సుదర్శన్ రెడ్డి వాటిని మార్చి పంపించారని అర్వింద్ అన్నారు.  ప్రైవేట్ భూములైన నిజాంషుగర్స్ భూములను నవోదయకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరవదా? అని ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో కొనసాగుతున్న సుదర్శన్ రెడ్డి నిజాంషుగర్స్ ను తెరవకుండా చేసి సొంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిజాంషుగర్స్ భూములను నవోదయకు ఇచ్చే అవకాశం లేదని అధికారులు ఒక దిక్కు చెబుతున్నా.. వారి మాటలను పెడచెవిన పెట్టిన సుదర్శన్ రెడ్డి కేవలం నవోదయను అడ్డుకోవడం, నిజాంషుగర్స్ ను తెరవకుండా చేయడం లక్ష్యంగా కేంద్రానికి ప్రతిపాదనలను మార్చి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేసే సుదర్శన్ రెడ్డికి హోం మినిస్టర్ పదవి కావాల్నా..? అని ఎద్దేవా చేశారు. ప్రతి అధికారిని, నాయకులు, కార్యకర్తలను, సాధారణ ప్రజలను మతం పేరుతో తిట్టడమే సుదర్శన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు. సుదర్శన్ రెడ్డి వంటి వ్యక్తిని నమ్ముకుని నట్టేట మునుగొద్దని సీఎం రేవంత్ కు హితవు పలికారు.