విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్ 

హైదరాబాద్, బతుకమ్మ :  జీతాల్లో కోత విధించారని  హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరించారు. ఈసందర్భంగా సోమవారం మాజీ ఆర్మీ సైనికులు నిరసనకు దిగారు.  హైడ్రా కూల్చివేతలు చేసే ప్రాంతాల్లో మార్షల్స్  బందోబస్తు నిర్వహిస్తున్నారు.  రూ.29 వేలు ఉన్న జీతంలో రూ.7వేలు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్షల్స్ విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.