Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2024, 6:57 pm Posted by : ramakrishna

హైడ్రా ఓ మహా యజ్ఞం

  • అది ఆగదు ఇంకా జిల్లాలకు విస్తరిస్తాం
  • రుణమాఫీ విషయంలో హరీష్ రాజీనామా ఏమైంది
  • కొండా సురేఖ వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పే
  • 25 నామినేటేడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ల భర్తీ జరుగుతుంది
  • నిజామాబాద్ కు విద్య వైద్య పరంగా విజన్ ఉంది
  • టీపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్, బతుకమ్మ: హైద్రాబాద్ లో జరగుతున్న హైడ్రా ఓ మహా యజ్ఞం అలాంటి కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకి రావడం నేను సంపూర్తిగా స్వాగతించాను. అది ఏ ఓక్కరి కోసం ఆగదు అది జిల్లాలకు విస్తరిస్తుందని టిపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో చీట్ చాట్ లో మాట్లాడుతు…హైడ్రా విషయంలో ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం అన్నారు. మూసీ సుందరీకరణ జరుగుతుందని ముందుగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు.

Hydra is a great sacrifice

మూసీ నదిలో జరిగిన నిర్మాణాలను తొలగించేందుకు బిఆర్ఎస్ హయాంలోనే ప్లాన్ జరిగిందని దానిని అమలు చేస్తున్నాం అన్నారు. అవినీతి అనేది డిపిఆర్ కుడా కాలేదు దానిపై విమర్శలు , ఆరోపణలు అర్థరహితం అన్నారు. అమెరికాలో కేటిఆర్ చదివాడా.. లేదా సర్టిఫికెట్ కొన్నాడా అని ప్రశ్నించారు. రుణ మాఫీ విషయంలో హరీష్ రాజీనామా చేస్తానని మాటతప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలజరిగిన రుణమాఫీపై చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ అది కేవలం కేటిఆర్ పై కోపంతో మట్లాడారని దానిలో సమంతపై వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పన్నారు. అ విషయంలో టిపిసిసి వివరణ ఇవ్వాలని కోరిన తరువాతనే కోండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని అది ముగిసిన వివాదం అన్నారు. త్వరలో నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీ జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో జిల్లాకు త్వరలో చోటు దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ విషయంలో ఏ పార్టితో పోత్తు అనేది ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో విద్య, వైద్య పరంగా డెవలప్ చేస్తాం అన్నారు. 2025 నాటికి సీయంసీ మెడికల్ కళాశాల ప్రారంభించి పున: వైభవం కోసం పాటుపడుతాం అన్నారు. నిజామాబాద్ నగర విషయంలో ఇప్పటికే రివ్యూలు నిర్వహించడం జరిగిందని అన్నారు. నిజామాబాద్ కు ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు, ప్రభుత్వ డిగ్రీ , ఇంజనీరింగ్ కళాశాల తెస్తాం అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఎన్ సిఎస్ ఎఫ్ ను తెరిపించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది ఇప్పుడే తేల్చలేమని పార్టీ అదేశానుసారం అప్పుడు పని చేస్తామని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఎల్ సీ క్యాంపు కార్యలయం ఏర్పాటు చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు సహజమేనని అందరిని సమన్వయంతో కలుపుకొని పని చేస్తానని అన్నారు.

Hydra is a great sacrifice