Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2025, 1:39 pm Posted by : ramakrishna

పీర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు షురూ

మేడ్చల్, బతుకమ్మ: ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా మళ్లీ ప్రారంభించింది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వాతాపూర్ లో పోలీసు బందోబస్తు మధ్య గురువారం తెల్లవారుజాము నుంచి అక్రమ కూల్చివేతలను ప్రారంభించింది. ముస్లిం, క్రిస్టియన్ ల శ్మశాన వాటికలను కొందరు ఆక్రమించి నిర్మాణలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు.