బోధన్ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన హైదరాబాద్ డీ.ఆర్.ఎం
. . . ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా అంశాలను సమీక్షించిన నిపుణుల బృందం బోధన్, బతుకమ్మ : హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీ.ఆర్.ఎం) సంతోష్ కుమార్ వర్మ బోధన్ రైల్వే స్టేషన్‌లో సమగ్రమైన ఉన్నత స్థాయి తనిఖీని నిర్వహించారు. సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాల అధిపతుల బృందంతో కలిసి వచ్చిన డి.ఆర్.ఎం, స్టేషన్ మౌలిక సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాలు, గూడ్స్ యార్డ్ పనితీరు, భద్రతా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ...