జాల్ తలాబ్ లో హైద్రాబాద్ బాలుడి మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో బాబాన్ సహబ్ పహడ్ ప్రాంతంలో జాల్ తలాబ్ లో నీట మునిగి హైద్రాబాద్ కు చెందిన బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. హైద్రాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన అమన్ ఉద్ధిన్ (13) ఇటీవల నగరంలోని రెండవ టౌన్ పరిధిలోని హైమద్ పుర కాలనీలో బందువుల ఇంటికి వచ్చాడు. బుదవారం బందువులకు చెందిన మరో ఇద్ధరు పిల్లలతో కలిసి తిరిగేందుకు బయటకి వెళ్లి...