Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 7:27 pm Posted by : ramakrishna

జాల్ తలాబ్ లో హైద్రాబాద్ బాలుడి మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో బాబాన్ సహబ్ పహడ్ ప్రాంతంలో జాల్ తలాబ్ లో నీట మునిగి హైద్రాబాద్ కు చెందిన బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. హైద్రాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన అమన్ ఉద్ధిన్ (13) ఇటీవల నగరంలోని రెండవ టౌన్ పరిధిలోని హైమద్ పుర కాలనీలో బందువుల ఇంటికి వచ్చాడు. బుదవారం బందువులకు చెందిన మరో ఇద్ధరు పిల్లలతో కలిసి తిరిగేందుకు బయటకి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం సాయంత్రం జాల్ తలాబ్ లో స్నానానికి దిగి లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగిపోయాడు.  చెరువు గట్టున ఉన్న మిగిలిన ఇద్ధరు బాలురు భయపడి ఈ విషయంను ఇంటిలో కుటుంబ సభ్యులకు తెలుపలేదు. దానితో కుటుంబ సభ్యులు అమన్ ఉద్ధిన్ తప్పిపోయాడని రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. కాని రాత్రి ఇద్ధరు పిల్లలు అమన్ ఉద్ధిన్ నీట మునిగాడని చెప్పడంతో అక్కడ గాలించడంతో అతని డెడ్ బాడిలభ్యమైంది. ఈ మేరకు ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.