భర్త గొంతు కోసి.. ఆపై మహిళ ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలోని  కేపీహెచ్ బీ కాలనీలో  దారుణం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక చనిపోదామని దంపతులను నిర్ణయించుకున్నారు. ముందుగా భర్త రామకృష్ణ గొంతు కోసి భార్య రమ్యకృష్ణ చంపేసింది. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది.  విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి  దర్యాప్తు చేస్తున్నారు.