అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణం జరిగింది. పిల్లల ముందే భర్త అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన దంపతులు వెంకటేష్, త్రివేణి నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా, వెంకటేష్ తరచూ భార్యను అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. తాజాగా భర్త వేధింపులు తాళలేక భార్య త్రివేణి పుట్టింటికి వెళ్లింది. దీంతో అక్కడకు వెళ్లిన వెంకటేష్.. తాను మారానని, నమ్మించి త్రివేణిని...