బతుకమ్మ, వర్ని:
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యను భర్త కోడవలితో విచక్షణ రహితంగా పోడిచి హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్య పెంటవ్వ పై, భర్త బాలయ్య కొడవలితో విశిక్షణారహితంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు.కుటుంబ తగాదాలతో పాటు, మద్యం మత్తులో ఉన్న బాలయ్య తన భార్యను నరికి హత్య చేసిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వర్నిఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.