మరణంలోనూ భర్త వెంటే..

సత్యసాయి జిల్లా, బతుకమ్మ: జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచిన భర్త తన వదిలి వెళ్లిపోవడాన్ని ఆ భార్య తట్టుకోలేకపోయింది. జీవితభాగస్వామి లేని జీవితం తనకు వద్దని కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, భాగ్యమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. రోజూలాగే పొలానికి వెళ్లిన తిమ్మారెడ్డి ఇంటికి రాగానే అపస్మారక స్థితిలోకి వెళ్లి కన్నుమూశాడు. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా మారడాన్ని చూసిన...