Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 2:39 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారి, ధూపల్లి గెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుండి టివిఎస్ చాంప్ టీఎస్ 16ఈటీ 9295 వాహనం పై ఉన్న వాద్యాల  రాములు(54), ఆయన భార్య ఇంద్ర తో నిజామాబాద్ నుండి వారి స్వగ్రామం అయిన రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి వెళ్తున్నారు. నిజామాబాద్ – బోధన్ రహదారిలో ధూపల్లి రోడ్డు వైపు రోడ్డు దాటే క్రమంలో బోధన్ నుండి నిజామాబాద్ వైపు అతివేగంతో ఉన్న ఏపీ40 బీకే 0652 నంబర్ గల మహీంద్రా వాహనం బలంగా ఢీకొట్టడంతో రాములు అక్కడిక్కడే మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Husband dies in road accident, wife seriously injured