Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:39 pm Posted by : ramakrishna

క్షణికావేశంలో నాటు తుపాకితో కాల్చుకుని భర్త ఆత్మహత్య

 

. . . కుంటలో దూకి భార్య ఆత్మహత్యా యత్నం

 

. . . భార్య భర్త ల మధ్య గొడవనే కారణం

 

లింగంపేట, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లాలో భార్య భర్తల గొడవ నేపథ్యంలో క్షణికావేశంలో నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య స్తానికంగా కుంటలో దూకి ఆత్మహత్య యత్నం చేసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ కథనం ప్రకారం లింగంపేట్ మండలంలోని మోతె గ్రామనికి చెందిన తిలిపితీయా ఇంద్రజీత్ సింగ్ అతని భార్య తరచూ గొడవలు పడుతుండేవారు. అలాగే గురువారం నేను చనిపోతానంటే నేను చనిపోతానని వాదించుకున్నారు. దాంతో ఇంద్ర జిత్ సింగ్ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు పంపివేసి గదిలోకి వెళ్లాడు. అనంతరం తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఛాతీపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయిన ఇంద్రజిత్ సింగ్ భార్య తీవ్ర మనస్తాపంతో గ్రామ సమీపంలోని కుడికుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నాటు తుపాకిని దాచిన స్థానికులు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టు నిరూపించేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికుల వివరాలతో పాటు ఘటనా స్థలంలో ఇంద్రజీత్ ఛాతీలో తుపాకీ తుటా తొ కలిగిన గాయం వల్ల జరిగిన రక్త స్రావం పరిగణలోకి తీసుకుని నాటు తుపాకి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రజీత్ సింగ్ వన్య ప్రాణుల వేట కోసం నాటు తుపాకి ని వాడేవారని తెలిసింది. లింగం పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Husband commits suicide by shooting himself with a shotgun in a fit of rage