భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
సదాశివనగర్, బతుకమ్మ : భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సదాశివనగర్ గ్రామానికి చెందిన చిందం రవి కుటుంబ కలహాల కారణంగా ఈనెల 22న రాత్రి తన భార్య లక్ష్మి (40)పై బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు సురేష్ 23న ఉదయం ఇంటికి వచ్చి సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు....