కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
కామారెడ్డి, బతుకమ్మ : అడిగిన సమాచారం ఇవ్వడం లేదని భార్యభార్తలు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అడిగిన సమాచారం ఇవ్వడం లేదని ఆత్మహత్య చేసుకుంటామని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్న 2022 సంవత్సరంలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు...