రోడ్డు ప్రమాదంలో హున్సా యువకుడు మృతి
బతుకమ్మ, బోధన్ : సాలూర మండలం హున్సా గ్రామానికి చెందిన నందకుమార్ (21) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గ్రామస్తుల సమాచారం ప్రకారం, ఉద్యోగరీత్యా బైక్‌పై ప్రయాణిస్తుండగా పటాన్‌చెరు వద్ద వాటర్‌ట్యాంక్‌తో కూడిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి ముగ్గురు అక్కలు ఉండగా, ఏడాది క్రితమే తండ్రి దేవయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పంచనామా అనంతరం శనివారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు. నందకుమార్ మృతి గ్రామంలో విషాదఛాయలు నింపగా, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని...