కామారెడ్డి లో హంగ్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపాలిటీ ఫలితాలలో హంగ్ ఏర్పడింది. చైర్మన్ పదవికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 25 ఏ పార్టీకి రాలేదు. మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్ 3 వార్డుల్లో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో వారే చైర్మన్ పదవి పొందనున్నారు.