వందల ఎకరాలు కబ్జా

- పైసలిస్తే ఇందల్వాయి పెద్ద చెరువు భూమికి పట్టాలు - చెరువు కుంటలా మారుతోందని గ్రామస్తుల ఆందోళన - పట్టించుకోని రెవెన్యూ ఉన్నతాధికారులు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి పెద్ద చెరువు భూమి వందల ఎకరాలు కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. మండల కేంద్రం చుట్టు పక్కల ఉన్న ఏ గ్రామంలోనూ ఇంత పెద్ద చెరువు లేదు. రామడుగు వరకు నీరందించే చెరువు భూములను అధికారులు ఇష్టారాజ్యంగా పట్టాలు చేసి పంచిపెడుతున్నారు. పైసలిస్తే ఎంత భూమి అయినా కబ్జా చేసుకోవచ్చని ధీమా ఇస్తున్నారు....