నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ లో స్టఫ్ డ్యూటీలో భాగంగా పోలీసులు శుక్రవారం ఉదయం ఫ్లాట్ ఫాంను తనిఖీ చేసే క్రమంలో వారికి ఒక బ్యాగ్ కనిపించింది. వెంటనే అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని కొద్దిసేపు చూసి ఎవరూ లేకపోవడంతో ఆ బ్యాగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. బ్యాగ్ ను చెక్ చేయగా అందులో లక్షా ఎనిమిది వేల ఐదు వందల నగదు, ఒకటిన్నర తులాల బంగారు చైన్, అద్ద తులం ఉంగరం, బట్టలు, ఫోన్, ఏటీఎం ఉన్నాయి. వెంటనే అందులో ఉన్న ఫోన్, ఏటిఎం ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఆ బ్యాగ్ జగిత్యాల జిల్లాకు చెందిన మామిడాల నర్సయ్యది గా గుర్తించార. వెంటనే అతనికి సమాచారం అందించి పిలిపించారు. తాము ముంబై నుంచి నిజామాబాద్ కు శుక్రవారం వచ్చామని మామిడాల నర్సయ్య తెలిపారు. తమ స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తమ బ్యాగులు తీసుకుని కార్ లో వెళ్లే హడావిడిలో ఇక్కడ ఒక బ్యాగ్ మరిచిపోయామని తెలిపారు. దీంతో బ్యాగులో ఉన్న డబ్బులు, బంగారం చైన్, రింగు అన్నీ రీసెప్ట్, ఫోటో తీసుకుని పోలీసులు బాధితులకు అప్పజెప్పారు. బ్యాగును కాపాడి అప్పజెప్పిన హెడ్ కానిస్టేబుల్ కుబేరుడు, కానిస్టేబుల్ సీనానాయక్, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పాషాను ఈ సందర్భంగా అభినందించారు.