Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 8:03 pm Posted by : ramakrishna

బీసీ సంఘం ఆధ్వర్యంలో మానవహారం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : బీసీలకు రాజకీయ ఉద్యోగ విద్యలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ తో నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మానవహారం కార్యక్రమం నిర్వహించారు. “పార్టీలపరంగా రిజర్వేషన్లు వద్దు, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుపరిచాకే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నారు. బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ రాష్ట్ర పిలుపుమేరకు వివిధ కార్యక్రమాలు ఇదివరకు చేపట్టినామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. అందులో భాగంగా బీసీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహం వద్ద మానవహార కార్యక్రమం చేపట్టినామని నరాల సుధాకర్ అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఈ ప్రభుత్వాల బాధ్యత అని ఇది ఎవరి బిక్ష కాదు అని అన్నారు. పార్టీలపరంగా రిజర్వేషన్లతో ఎటువంటి లాభం ఉండదని, పంచాయతీ ఎలక్షన్లలో గుర్తులు ఉండవు కాబట్టి పార్టీలపరంగా రిజర్వేషన్లు అనే మాట బూటకంగా మారుతదని అన్నారు. కాబట్టి బీసీ రిజర్వేషన్లను 9 షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగబద్ధంగా అమలుపరిచినాకానే పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు.  నేటి మానవహార కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డకు ధన్యవాదాలు అని నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ అన్నారు.  ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కరిపే రవీందర్, బసవసాయి, బగ్గలి అజయ్, శ్రీలత, చంద్రకాంత్, బాలన్న, గోపాల్, సురేందర్, లింగరాజు, ఆర్టిసి నరసయ్య, అనిల్, దయానంద్, గంగాధర్, వాసంజయ, రుక్మిణి, శ్రీనివాస్, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.